Uber : 27 రూపాయలకు కక్కుర్తి పడిన క్యాబ్ డ్రైవర్‌ ... 28 వేలు జరిమానా కట్టిన కంపెనీ!

ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి అసలు ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేశాడు.దీంతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌ ఇండియా ఏకంగా ఆ వ్యక్తికి రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.అసలేం జరిగింది.. అనే విషయాలను ఈ కథనంలో చదివేయండి...

Uber : 27 రూపాయలకు కక్కుర్తి పడిన క్యాబ్ డ్రైవర్‌ ... 28 వేలు జరిమానా కట్టిన కంపెనీ!
New Update

Cab Driver : ప్రస్తుత రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే సొంత వాహనాలే ఉండాల్సిన పని లేదు. నిమిషాల్లో ఆన్ లైన్‌ బుకింగ్(Online Booking) చేసుకుంటే... క్షణాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇలాంటి సేవలను అందించడానికి ఓలా, ర్యాపిడో(Rapido), ఉబర్‌ వంటి సంస్థలు ముఖ్యమైనవి. ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం కూడా చాలా సులువైపోయింది. దీంతో రోజురోజుకి ఆ సంస్థల సేవలకు ఫుల్‌ డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది క్యాబ్ డ్రైవర్లు వినియోగదారులను మోసం చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఘటననే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి అసలు ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేశాడు.దీంతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌ ఇండియా(Uber India) ఏకంగా ఆ వ్యక్తికి రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌(Punjab) కు చెందిన రిత్విక్‌గార్గ్‌.. 2022 సెప్టెంబరు 19న ఉబెర్ యాప్ ద్వారా చండీగఢ్‌లోని సెక్టార్ -21 నుండి సెక్టార్ -13 మణిమజ్రాకు క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో యాప్‌లో 7.82 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ రూ.53 చార్జ్ చేస్తున్నట్టు చూపించింది. మణిమజ్ర వద్దకు రాగానే డ్రైవర్ కైలాష్ అతడి నుంచి రూ.80 ఛార్జీ వసూలు చేశాడు.

ఈ విషయం గురించి రిత్విక్‌ కంపెనీకి ఫిర్యాదు చేయడంతో పాటు చాలా సార్లు మెయిల్స్ ద్వారా ఉబర్ ఇండియా దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ కూడా కంపెనీ సరిగా పట్టించుకోలేదు. దీంతో కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపించాడు. అయినా కంపెనీ నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. మేము కేవలం సర్వీస్‌ మాత్రమే ఇస్తామని డ్రైవర్లకు మాకు సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది.

డ్రైవర్‌పై చర్య తీసుకోవడానికి ఉబెర్ ఇండియా ఎటువంటి దర్యాప్తు నివేదికను నమోదు చేయలేదని కమిషన్ తెలిపింది. దీంతో రిత్విక్‌ గార్గ్‌ చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. ఉబర్‌ ఇండియా సమాధానంపై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

సంబంధిత డ్రైవర్‌పై చర్య తీసుకోవడానికి Uber ఇండియా యాప్ ఎటువంటి దర్యాప్తు నివేదికను నమోదు చేయలేదని కమిషన్ తెలిపింది. కస్టమర్‌ చెల్లించే డబ్బుల్లో ఉబర్ కూడా నగదు తీసుకుంటున్న క్రమంలో కచ్చితంగా ఈ వ్యవహారం గురించి ఉబర్ బాధ్యత తీసుకోవాల్సిందే అని కమిషన్ తేల్చి చెప్పింది.

ఈ క్రమంలోనే వినియోగదారుని వద్ద నుంచి అదనంగా తీసుకున్న రూ. 27తో పాటు ఫిర్యాదుదారు రిత్విక్‌ గార్గ్‌ కు రూ. 5 వేల పరిహారం, 3 వేలు ఖర్చులు కింద చెల్లించాలని ఉబర్‌ ఇండియాను కమిషన్ ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి తప్పిదాలను జరగకుండా చూడాలని కమిషన్‌ లీగ్‌ ఎయిడ్‌ ఖాతాలో రూ. 20 వేలు జమ చేయాలని ఆదేశించింది.

Also read: 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి… 26 వేల మంది ఉద్యోగులు ఔట్‌!

#fine #uber-driver #extra-charge #uber-india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe