హైదరాబాద్‌లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల దారుణ హత్య భాగ్యనగరంలో ఘోరం జరిగింది. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్థరాత్రి టైంలో గుర్తుతెలియని వాళ్లు కత్తులు, బండరాళ్లతో దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. తప్పచబుత్ర పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. By Vijaya Nimma 21 Jun 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి హత్య వెనుక ఉన్నది ఎవరు..? టప్పచబుత్ర పరిధిలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి, రియాజ్ అలియాస్ సోఫియా అనే ఇద్దరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు. నిన్న అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు కత్తులు, బండరాళ్లతో కొట్టి వారిద్దరిని కిరాతకంగా చంపేశారు. ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం.. సీనియర్ పోలీస్ అధికారులు, క్లూస్ టీం హత్య జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. ఘటనా స్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? ఏ సమయంలో జరిగింది? హత్య చేయడానికి కారణాలు ఏంటి? అనే దానిపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. డీసీ కిరణ్ ఖరే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని, ఈ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీనలను పరిశీలిస్తున్నామనని, హత్య చేయడానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉందని తెలిపారు. నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి