MLA KTR: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఎన్నికల్లో రెండు కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ప్రచారంలో అన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రుణమాఫీ విషయంలో రోజుకో మాట చెబుతోందని ఫైర్ అయ్యారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు.. వారు నియామకపత్రాలు ఇచ్చి వారే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సొంత డబ్బా కొట్టుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) అలవాటే అని చురకలు అంటించారు. పదేళ్లలో అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
పూర్తిగా చదవండి..MLA KTR: అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
TG: రెండు కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందిందని అన్నారు కేటీఆర్. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అని పేర్కొన్నారు.
Translate this News: