Murder : కాకినాడలో జంట హత్యల కలకలం..అడ్డొచ్చిన మహిళ ని కూడా!

కాకినాడ చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను, పెండ్యాల లోవమ్మ ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడంతో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తుంది.

New Update
Murder : కాకినాడలో జంట హత్యల కలకలం..అడ్డొచ్చిన మహిళ ని కూడా!

Kakinada : కాకినాడ(Kakinada) గొల్లప్రోలు మండలం చేబ్రోలు లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం పంట పొలాల్లో(Crop Fields) జంట హత్యలు(Twin Murders) ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను(Posina Srinu), పెండ్యాల లోవమ్మ ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు అనే వ్యక్తి విచక్షణా రహితంగా కత్తితో నరికి చంపాడు.

ఈ క్రమంలోనే అడ్డు వచ్చిన లోవమ్మ(Pendyala Lovamma) తల్లి రామలక్ష్మి(Ramalakshmi) పై కూడా కత్తి(Knife) తో దాడికి దిగాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు నిందితుడు దాడి ఎందుకు చేశాడు అనే క్రమంలో పోలీసులు ఆరా తీయగా... లోవమ్మ గత కొంతకాలంగా నాగబాబుతో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పోసిన శ్రీను అనే వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకుందని నాగబాబు అనుమానించాడు.

ఆ అనుమానంతోనే శ్రీనుని, లోవమ్మ ని ఇద్దరిని నరికి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన పోసిన శ్రీనుకు భార్య ఇద్దరు కుమారులున్ఆనయ. భర్తతో విభేదాల కారణంగా గత కొంత కాలంగా లోవమ్మ విడిగా ఉంటుంంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also Read : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు