TG Rains: నారాయణపేటలో విషాదం.. గోడ కూలి తల్లికూతుళ్లు మృతి

నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఇల్లు కూలి తల్లి, కూతురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు హనుమమ్మ(78), అంజిలమ్మ (35)గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

New Update
TG Rains: నారాయణపేటలో విషాదం.. గోడ కూలి తల్లికూతుళ్లు మృతి

TG Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలో వాగులు వంకలు, పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమైయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కారణంగా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎక్కమేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఇల్లు కూలి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమమ్మ(78)కు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. వారందరికీ వివాహాలు జరిగాయి. కొడుకు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు.

Also Read: కుటుంబాన్ని మింగిన ఆన్లైన్ బెట్టింగ్.. పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య!

హనుమమ్మ, భర్త చనిపోయిన రెండో కూతురు అంజులమ్మతో కలిసి ఉంటుంది. అయితే.. భారీ వర్షాలకు వారి ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో నిద్రిస్తున్న తల్లీకుమార్తెపై ఆ గోడ పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతులు హన్మమ్మ, ఆమె కుమార్తె అంజిలమ్మ (35) గురించారు. ఇళ్లు కూలీ తల్లి కూతుళ్లు ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న కారణంగా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు