TS: కుటుంబంలో ఘోర విషాదం.. తల్లిదండ్రులకు తోడుగా వెళ్లిన అన్నా, తమ్ముడు మృతి..!

TS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జమేదారు బంజర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు అన్నా, తమ్ముడు మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న మరో మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

TS: కుటుంబంలో ఘోర విషాదం.. తల్లిదండ్రులకు తోడుగా వెళ్లిన అన్నా, తమ్ముడు మృతి..!
New Update

Khammam: పిడుగుపాటుకు అన్నా, తమ్ముడు మృతి చెందారు. ఈ ఘోరమైన విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర గ్రామంలో చోటుచేసుకుంది. మరో మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన బొర్రాచందు (11) బొర్రా సిద్ధు (15)గా గుర్తించారు.

Also Read: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..!

పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులకు తోడుగా ఉండేందుకు వెళ్లారు చందు, సిద్దు. అయితే, పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. కుమారులు ఇద్దరూ తిరిగిరాని లోకానికి వెళ్లడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో మహిళా రైతును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గడచిన రెండు రోజులుగా దమ్మపేట మండలం వ్యాప్తంగా ఎడతెరపులేని వర్షం కురుస్తోంది.

#khammam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe