రిటైర్ ఐఆర్ఎస్ శామ్యూల్ ఇంట్లో చోరీ కేసులో కీలక మలుపు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ చోరీ కేసులో దుండిగల్ ఎస్సై కృష్ణ ప్రధాన సూత్రదారిగా పోలీసులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి దాదాపు రూ. 100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది By Vijaya Nimma 30 Jun 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి సూత్రదారి ఎస్సై కృష్ణ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. ఈ చోరీ కేసులో దుండిగల్ ఎస్సై కృష్ణ ప్రధాన సూత్రదారిగా పోలీసులు గుర్తించారు. సురేందర్ అనే వ్యక్తితో కలిసి దాదాపు రూ. 100 కోట్ల ఆస్తి కొట్టేసేందుకు ఎస్సై కృష్ణ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ఇంట్లో సురేందర్ అనే రియల్టర్ చోరీ చేశారు. మే 30న శామ్యూల్ ఇంటికి వెళ్లిన సురేందర్.. ఆయనకు ఆహారంలో మత్తు మందు ఇచ్చాడు. అనంతరం శామ్యూల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత సురేందర్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, 5 లక్షలు నగదు, 30 తులాలు బంగారం దోపిడీ చేశాడు. చోరీ చేసి గోవాలో క్యాసినో.. అయితే వాటన్నింటిని తీసుకెళ్లి తన స్నేహితుడు అయిన దుండిగల్ ఎస్సై కృష్ణకు ఇచ్చాడు. ఆ తర్వాత చోరీ చేసిన డబ్బులో కొంత తీసుకొని గోవా పోయి క్యాసినో ఆడాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా సురేందర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. విచారణలో సురేందర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎస్సై కృష్ణను రెండు రోజులు కస్టడీకి తీసుకొని గాంధీనగర్ పోలీసులు విచారించారు. త్వరలోనే ఎస్సై కృష్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి