/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/fire-2-jpg.webp)
హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరగడం కలకలం రేపుతోంది. అమీర్పేట్ పరిధిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకోగా.. పాతబస్తీ పరిధిలోని షాలిబండలో మరొకటి జరిగింది. అమీర్పేట పరిధిలోని మధురానగర్లో ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు ఎగసిపడటంతో లక్షల విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇక షాలిబండలో ప్రాంతంలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
VIDEO | A major fire broke out at an electronic shop in Hyderabad yesterday. More details are awaited. pic.twitter.com/LbhSu55UvC
— Press Trust of India (@PTI_News) November 13, 2023