Bharat Pilots: కుప్పకూలిన విమానం..ఇద్దరు భారతీయ ట్రైనీ పైలెట్లు మృతి! కెనడా (Canada) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్ (British) కొలంబియా (Colambia) ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇండియన్ ట్రైనీ పైలెట్లు మృతి చెందారు. By Bhavana 07 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి కెనడా (Canada) లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బ్రిటీష్ (British) కొలంబియా (Colambia) ప్రావిన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఇండియన్ ట్రైనీ పైలెట్లు మృతి చెందారు. మృతి చెందిన పైలట్లను భయ్ గద్రూ, యశ్ విజయ్ రాముగాడే గా గుర్తించారు. వీరు ఇద్దరు కూడా ముంబైకి చెందిన వారు గా గుర్తించారు. పైపర్ పీఏ -34 సెనెకా అనే చిన్న విమానం చిల్లివాక్ నగరంలో పొదల్లో కూలిపోయిందని కెనడా పోలీసులు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో మరో పైలట్ కూడా మృతి చెందారు. కెనడా పోలీసులు విమానం కూలిపోయిన ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు కెనడా పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. Also read: మెగాఫ్యామిలీలో మొదలైన పెళ్ళి సంబరాలు ఈ ప్రమాదం కొలంబియాలోని వాంకోవర్ కు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న మోటెల్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం లో చనిపోయిన భారతీయ పైలెట్ల కుటుంబాలకు ప్రమాదం గురించి తెలియజేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కెనడా ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి రెండు ఎయిర్ అంబులెన్స్‌లు కూడా వచ్చాయి కానీ..ప్రమాద స్థలంలో ఐదు అంబుతెన్స్ లు ఉండడంతో అవి తిరిగి వెనక్కి వెళ్లాయి. ఒక వైద్య బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన స్థలం ముందు ఓ హోటల్ ఉంది. కానీ ప్రజలెవ్వరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. అధికారులు ఈ విషయం గురించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. #indians #pilots #british #combia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి