Medchal: ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు.. ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల గలీజ్ దందా!

తెలంగాణలో మరో ఇద్దరు అవీనితి ఆఫీసర్లు ఏసీబీకి చిక్కారు. మేడ్చల్ జిల్లా సూరారం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల వెంకటేశం ఐదు లక్షలతో పట్టుబడగా.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల తహశీల్దార్‌ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంగం దుర్గయ్య డెబ్బై వేలతో దొరికిపోయాడు.

Medchal: ఏసీబీకి చిక్కిన అవినీతి ఆఫీసర్లు.. ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల గలీజ్ దందా!
New Update

Telangana: తెలంగాణలోని మేడ్చల్, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు అవినీతి ఆఫీసర్లు ఏసీబీకి చిక్కారు. ఒకరు ఐదు లక్షల లంచంతో పట్టుబడగా మరొక్కరు డెబ్బై వేలతో అడ్డంగా బుక్క్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో ఒక వ్యక్తి తన భూమిలో అభివృద్ధి పనుల కోసం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆకుల వెంకటేశంను సంప్రదించగా.. ఐదు లక్షల లంచం డిమాండు చేశాడు. అందులో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు. అంతేగాక ఇంతకుముందు ఈ ఇన్‌స్పెక్టర్ ఇదే వ్యక్తిపై రౌడీ షీట్ నమోదు కాకుండా ఉండటం కోసం రెండు లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నట్లు బటయపడింది.

అలాగే సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండల తహశీల్దార్‌ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సంగం దుర్గయ్య లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ & మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ కోసం ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించిన చెక్కును ప్రాసెస్ చేయడానికి ప్రతిఫలంగా ఒక రైతు నుంచి డెబ్భై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా.. సదరు రైతు ఏసీబీని ఆశ్రయించి పట్టించాడు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe