అమర్‌ నాథ్‌ యాత్రికుల బస్సు ప్రమాదం ఆరుగురి మృతి!

శనివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో ముంబై- నాగపూర్‌ హైవే పై రెండు ట్రావెల్‌ బస్సులు ఒకదానినొకటి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 గురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్డాణాలో శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు బస్సులు కూడా ప్రైవేట్‌ ట్రావెల్ బస్సులుగానే అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం అందించారు.

దీంతో అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు బస్సులు ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొట్టడం వల్ల రెండు బస్సుల్లో కలిసి సుమారు ఇప్పటి వరకు 6 గురు వ్యక్తులు మృతి చెందారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారందరిని కూడా అధికారులు స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గురైన బస్సులలో ఓ బస్సు అమర్‌ నాథ్‌ యాత్రికులతో వెళ్తున్నట్లు సమాచారం. మరొకటి ప్యాసింజర్లను తీసుకుని వెళ్తుంది. గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్లు నిద్ర మత్తులో ఉండటం వలనో లేక అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అమర్‌ నాథ్‌ యాత్ర ఈ ఏడాది జులై 1 నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు