Nalgonda Accident: నల్గొండ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

TG: నల్గొండ జిల్లాలో ఒకే రోజు రెండు బస్సు ప్రమాదాలు సంభవించాయి. ప్రైవేట్ బస్సు బోల్తా పడి 30మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. శెట్టిపాలెంలో మరో ప్రైవేట్ బస్సు డీసీఎంను ఢీ కొట్టడంతో క్లినర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Nalgonda Accident: నల్గొండ జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు

Nalgonda Accident: నల్గొండ జిల్లాలో ఒకరోజు రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. జగిత్యాల నుంచి దర్శి వెళ్తుండగా అద్దంకి-నార్కెట్‌పల్లి వద్ద బస్సు బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్రేన్ సహాయంతో ప్రయాణికులను బయటకు తీశారు పోలీసులు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. నల్గొండలోని శెట్టిపాలెంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లినర్ మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : నిన్న నాగార్జున.. నేడు పల్లా.. హైడ్రా యాక్షన్‌పై ఉత్కంఠ

Advertisment
తాజా కథనాలు