Twitter Reacts To Centre Orders: ట్విట్టర్‌లో కొన్ని ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట అకౌంట్లు, కొన్ని పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. భారత ప్రభుత్వ కోరిక మేరకు ట్విట్టర్ కొన్ని ఖాతాలను బ్లాక్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మస్క్ కంపెనీ ఏకీభవించడం లేదు. ప్రజలకు వాక్ స్వాతంత్య్రం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం ఒక పోస్ట్ ద్వారా వివరించింది. ట్విట్టర్ వ్యాఖ్యలపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
ఇది తొలిసారి కాదు:
సామాజిక, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న వివాదాస్పద అకౌంట్లు, కాంట్రవర్శియల్ పోస్టులను బ్లాక్ చేయమని భారత ప్రభుత్వం కోరుతోంది. కేంద్ర ఉత్తర్వును అనుసరించి అకౌంట్లను బ్లాక్ చేయడంపై ట్విట్టర్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ వ్యతిరేకత వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2021లో కూడా ట్విట్టర్ ఇదే వైఖరిని చూపించింది. ప్రభుత్వ ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని వాదించింది. ఎలాన్ మస్క్ భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. ట్విట్టర్‌లో స్వేచ్ఛగా మాట్లాడేందుకు, రాసేందుకు అందరికీ సమాన అవకాశం కల్పిస్తారని ట్విట్టర్ చెబుతుంటుంది.
పాటించాల్సిందేనంటున్న కేంద్రం:
గతేడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్‌లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. దేశ చట్టాలను సోషల్‌మీడియా కంపెనీలు తప్పక పాటించాలని కేంద్రం స్పష్టం చేస్తోంది.
Also Read: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!
ALSO WATCH: