అవును..మా నాన్న బాంబులు విసిరాడు..కానీ...ట్విట్టర్ వార్.! కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారానికి దారితీసింది. రాజేష్ పైలట్ వైమానిక దళంలో ఉన్నప్పుడు మిజోరంపై బాంబులు వేశారని అమిత్ మాల్వియా ఆరోపించారు. ఈ విషయంపై సచిన్ పైలట్ స్పందించారు. By Bhoomi 16 Aug 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ గురించి బీజేపీ...ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కొద్ది రోజుల క్రితం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా ఛానెల్ కు సంబంధించిన వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ...అమిత్ మాలవీయ రాజేష్ పైలట్ మిజోరంలో బాంబులు వేసారంటూ ట్వీట్ చేశారు. అమిత్ మాలవీయ చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఫైర్ అయ్యారు. "అఫ్ కోర్స్ మా నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్.. అతను బాంబులు విసిరాడు,కానీ చెప్పిన మాటలన్నీ అవాస్తవం అన్నారు. సచిన్ పైలట్.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా BJP IT సెల్ హెడ్ వ్యాఖ్యలకు చురకలంటించారు. అమిత్ మాల్వియా జీ... మీ దగ్గర తప్పుడు తేదీలు, తప్పుడు వాస్తవాలు ఉన్నాయి... అవును, భారత వైమానిక దళ పైలట్‌గా నా దివంగత తండ్రి బాంబులు విసిరారు. కానీ 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో మీరు చెబుతున్నట్లుగా 1966 మార్చి 5న మిజోరంపై కాకుండా అప్పటి తూర్పు పాకిస్థాన్‌పై బాంబు వేశారు. అతను 29 అక్టోబర్ 1966 న భారత వైమానిక దళంలోకి చేరారు. జై హింద్ ..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. సచిన్ పైలట్ తన తండ్రి రాజేష్ పైలట్ నియామక పత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. అమిత్ మాలవీయ ఏమన్నారంటే? అమిత్ మాల్వియా ఆగస్టు 13న తన ట్విట్టర్ హ్యాండిల్ ఇలా రాసారు. , "1966 మార్చి 5న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబులు వేసిన భారత వైమానిక దళానికి చెందిన విమానాలను రాజేష్ పైలట్, సురేశ్ కల్మాడీ నడుపుతున్నారు. తరువాత కాంగ్రెస్ ఎంపీగా, ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈశాన్య ప్రాంతంలో సొంత ప్రజలపైనే వైమానిక దాడులు చేసిన వారికి ప్రతిఫలంగా, గౌరవంగా ఇందిరాగాంధీ రాజకీయాల్లో స్థానం కల్పించారని స్పష్టమైంది అంటూ ట్వీట్ చేశారు. మిజోరం విషయంలో కాంగ్రెస్ పై మోదీ ఫైర్: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం మిజోరాంపై వైమానిక దళాన్ని ఉపయోగించిందని అన్నారు. భారత్-చైనా యుద్ధ సమయంలో ఈశాన్య ప్రాంత ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి మిగిలిపోయారని ప్రధాని మోదీ అన్నారు. ఆ సమయంలో మిజోరాం పౌరులు మన పౌరులు కాదా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఆ రాష్ట్ర ప్రజలు ప్రతి సంవత్సరం మార్చి 5వ తేదీన సంతాపం తెలుపుతారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ 1966 మార్చిలో మిజోరంలో వేర్పాటువాద శక్తులను ఎదుర్కొనేందుకు ఇందిరా గాంధీ కృషి చేశారని, పాకిస్థాన్, చైనాల మద్దతు ఉందన్నారు. మిజోరం విషయంలో ప్రధాని మోదీ ఇందిరా గాంధీని విమర్శించడం సరికాదన్నారు. #sachin-pilot #amit-malaviya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి