కొత్త నిబంధనలతో ట్విట్టర్‌ ఖాతా..కారణం ఇదే

ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్ ట్విట్టర్ ఖాతాదారులకు షాకింగ్ విషయం చెప్పారు. పలు ఖాతాలోంచి చూసే వాటిని రద్దు చేస్తూ లిమిటెడ్‌గా ఉంటాయంటూ ఓ ప్రకటన చేశారు. ఈ నిబంధనలు తాత్కాలికంగా ఉంటాయని చెప్పారు. అయితే భారీ ఎత్తున డేటా చౌర్యం జరుగుతుండడంతో, దాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధినేత మస్క్ వెల్లడించారు.

New Update
కొత్త నిబంధనలతో ట్విట్టర్‌ ఖాతా..కారణం ఇదే

Twitter temporarily restricts tweets users cansee

ఇతరుల ట్వీట్లను చూడాలంటే అకౌంట్‌ తప్పనిసరి

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పలు కొత్త మార్పులు వచ్చాయి. ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్వీట్లను చూడాలంటే అకౌంట్‌లో తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయనా.. వెబ్ బ్రౌజర్ ద్వారా ఇతర ఖాతాదారుల ట్వీట్లను చూసే అవకాశం ఉండేది. ట్విట్టర్ ఖాతా లేకపోయినా.. లింక్‌ను బ్రౌజర్‌లో ఓపెన్ చేసి చూసే వీలు ఉండేది. కానీ, ఈ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. ఖాతాదారులు లాగిన్‌ అవుతూనే ఇతరుల వివరాలు చూడొచ్చు. అకౌంట్ లేని వారు కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డేటాను కాపాడేందుకే..

ఇక, ట్విటర్‌ అన్ వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకు 1000 ట్వీట్లు మాత్రమే చూసే అవకాశం కల్పించాలని ట్విట్టర్ అధినేత ఎలాన్‌ మస్క్‌ నిర్ణయించారు. కొత్తగా ఖాతా తెరిచిన వారు రోజుకు కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూసే విధంగా పరిమితి విధించారు. డబ్బులు చెల్లించి ఖాతాను వెరిఫై చేసుకున్న వారు రోజుకు 10 వేల పోస్టులు చూడొచ్చని తెలిపారు.

అయితే.. తొలుత వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, అన్ వెరిఫైడ్ వారికి 600, కొత్త ఖాతాదారులకు 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలాన్ మస్క్ కొన్ని గంటల తర్వాత దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ట్విట్టర్ నుంచి భారీ ఎత్తున డేటా చౌర్యం జరుగుతోందని, దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్‌ చెబుతున్నారు. ఈ నిబంధనలు తాత్కాలికంగా ఉంటాయని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు