Twinkle: 50 ఏళ్లకు డిగ్రీ పట్టా..హీరో భార్యపై నెట్టింట ప్రశంసలు మాజీ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా 50 ఏళ్ల వయసులో లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి పట్టా పొందింది. దీంతో తన కుటుంబ సపోర్టుతోనే కల నిజమైందంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. భర్త అక్షయ్ కుమార్ సూపర్ విమెన్ అంటూ పొగిడేయగా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. By srinivas 18 Jan 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Twinkle Khanna : మాజీ నటి, రచయిత, స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) భార్య.. ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) 50 ఏళ్ల వయసులో గొప్ప మైలురాయిని సాధించింది. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని (Master's Degree) విజయవంతంగా పూర్తి చేసి పట్టా పొందింది. In an homage to Master Raju, I can finally call myself Master Twinkle :) @GoldsmithsUoL pic.twitter.com/1J0IrQ2cbA — Twinkle Khanna (@mrsfunnybones) January 16, 2024 అడ్డంకులు దాటుకుని: ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచకున్న ఆమె.. 'గ్రాడ్యుయేషన్ పూర్తైన రోజు. గోల్డ్‌స్మిత్స్‌లో నా మొదటి రోజు నిన్ననే అయినప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం జరిగినట్లుగా అనిపిస్తుంది. నా కుటుంబం నాతో ఉండడం వల్లే నా లైఫ్ ఈ రోజు నేను ఊహించిన దానికంటే మరింత పరిపూర్ణంగా మారింది. మనం ఎదగడానికి సులభమైన మార్గం ఉన్నప్పుడు ఒక దశ అడ్డుగా వస్తుంది. అయినప్పటికీ ఇతర మార్గాల్లో మనల్ని మనం నెట్టుకుంటూ ఎదగాలి' అంటూ హ్యాపీగా ఫీల్ అయింది. ఇది కూడా చదవండి : Charmme: నీవు లేకుంటే జీవితం అసంపూర్ణం.. మళ్లీ నీ కౌగిలి కావాలనిపిస్తోంది: ఛార్మి ఎమోషనల్ And it’s here. Graduation day. My first day at Goldsmiths feels like it was both yesterday and years ago. A sunny day, a pretty sari, and having my family with me make this day even more perfect than I ever imagined. There comes a stage when the easiest way to grow is… pic.twitter.com/vSfdr9YPoR — Twinkle Khanna (@mrsfunnybones) January 16, 2024 సూపర్ విమెన్.. ఇక దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్.. ‘చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా. ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, నన్ను, పిల్లలను చూసుకుంటూనే డిగ్రీ పూర్తి చేశావ్. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నీవు ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్’’ అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు. అలాగే పట్టా అందుకున్న ట్వింకిల్ తో దిగిన ఫొటోను పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అయితే అక్షయ్ పోస్ట్‌పై స్పందించిన ట్వింకిల్ ఖన్నా.. ‘ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం' అన్నారు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ ఇద్దరినీ పొగిడేస్తున్నారు. #twinkle-khanna #graduates #with-masters-degree మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి