SHARMILA VS TUMMALA over palair ticket: తెలంగాణ కాంగ్రెస్‌లో పాలేరు వార్ అంతకంతకూ పెరుగుతోంది. పాలేరు టికట్ కోసం వైఎస్ షర్మిల వర్సెస్ తుమ్మల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు షర్మిల అధికారికంగా ప్రకటించలేదు కానీ.. హస్తం పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సోనియా గాంధీని కూడా కలిశారు షర్మిల. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy). పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే పాలేరు సీటు కావాలని తుమ్మల కోరినట్టు సమాచారం. దీనికి కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించడంతో.. ఒకవేళ కాంగ్రెస్‌లో తుమ్మల చేరితే సీటు కోసం ఇద్దరి మధ్య వార్ నడవడం ఖాయంగా కనిపిస్తోంది.
ముహూర్తం ఫిక్స్?
మరోవైపు బీఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఖమ్మం నుంచి భారీఎత్తున సమావేశమై తమపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. హస్తం పార్టీలో చేరేందుకు తుమ్మల సుముఖంగా ఉన్నారని, పార్టీ కూడా పాలేరులో ఆయనకు టికెట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్‌ఎస్ తొలి జాబితాలో ఖమ్మంలో పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల భంగపాటుకు గురయ్యారు. దీంతో ఈ మాజీ మంత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు.
ఎలా సాల్వ్ చేస్తారు?
టీడీపీలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తుమ్మల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వాలలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో మళ్లీ మంత్రి పదవిని పొందారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో తుమ్మలను బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ సంప్రదించాయి. ఇటీవల ఖమ్మంలో జరిగిన అమిత్ షా బహిరంగ సభలో ఆయన సమక్షంలో బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఖమ్మం జిల్లాపై ఆయనకు మంచి పట్టు ఉండడంతో తుమ్మల చేరిక ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే తుమ్మల అడిగినట్టు పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఇదే సమయంలో వైటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా పాలేరుపై దృష్టి సారించడంతో పాటు ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండడంతో పార్టీ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుందో చూడాల్సి ఉంది.
ALSO READ: సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!!