మరో భూ వివాదంలో తుల్జా భవానీరెడ్డి

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కుమార్తె తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం మరో మలుపు తిరిగింది.ఈ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీలో త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇస్తానని తుల్జా భావన స్పష్టం చేశారు. అయినా తుల్జా భవానీరెడ్డి కేసులో నమోదు చేశారు.

New Update
మరో భూ వివాదంలో తుల్జా భవానీరెడ్డి

Tulja Bhavanireddy in another land dispute

తుల్జాభవానిపై కేసు నమోదు

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతరుపై కేసు నమోదు చేశారు చేర్యాల పోలీసులు. గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించి తుల్జాభవానికీ తండ్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వివాదం నడుస్తోంది. 2 రోజుల క్రితం మత్తడి ఆవరణ స్థలంలో 1270 గజాల స్థలం చుట్టు ఉన్న ఫెన్సింగ్‌ను తుల్జాభవానిరెడ్డి కూల్చివేశారు. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు ప్రకటించారు. చేర్యాలలో తన పేరుమీదున్న భూమి చూట్టూ వేసిన ప్రహరీగోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్‌ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని రాజు భాయ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించాడని తుల్జా భవానీరెడ్డి ఆరోపిస్తున్నారు.

గ్రామస్తులు క్షమించాలి

మరోవైపు సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి భూమిని తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన కుమార్తె తుల్జా భవానిరెడ్డి ఆరోపించారు. చేర్యాలకు చేరుకున్న తుల్జా భవానిరెడ్డి తన పేరుతో ఉన్న భూమి చుట్టూ ఉన్న కంచెను కూల్చివేసారు. అయితే పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామ భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తన తండ్రిని క్షమించాలని తుల్జా భవాని గ్రామస్తులను కోరింది. ఊరి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నందుకు తండ్రిని క్షమించాలని బోర్డు కూడా పెట్టింది.

నా తండ్రే ఇలా చెప్పించారు..!

ఈ సందర్భంగా ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాన్నకు 70 ఏళ్లు.. రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.. ఎమ్మెల్యే కాకముందు వెయ్యి కోట్ల ఆస్తి ఉండేవారు. అలాంటి వాడు ఇలాంటి పనులు చేయకూడదు.. చెరువు భూమి నా పేరు మీద రిజిష్టర్ చేశారు. అది.. తప్పు జరిగిందా..క్షమించండని ప్రశ్నించారు. మళ్లీ ఆ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి తన పేరు మీద రాసిస్తున్నాను.ఇదిలా ఉండగా జనగామలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని భవానీ బహిరంగంగా నిలదీసిన విషయం చర్చనీయాంశకంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు