Tulsi: తులసి ఆకుల్లో దీన్ని కలిపి రాస్తే .. వద్దన్నా.. జుట్టు పెరుగుతుంది..! ఆయుర్వేదం ప్రకారం తులసి ఆకులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పని చేస్తాయి. తులసి ఆకులతో చేసిన పేస్ట్ జుట్టుకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీని తయారీ విధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Archana 07 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tulsi Benefits For Hair: హిందూ సాంప్రదాయంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం ఈ మొక్క అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. తులసి ఆకుల డికాషన్ తాగడం ద్వారా తలనొప్పి (Headache), జలుబు (Cold), గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు తులసి ఆకుల రసంలో ధనియాలు, మిరియాలు కలిపి తీసుకుంటే వాంతులు, దగ్గు తగ్గడంతో పాటు కడుపులో నులి పురుగులను కూడా చనిపోతాయి. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్నవారి తులసి ఓ అద్భుతమైన ఔషధమని చెబుతున్నారు నిపుణులు. తులసి ఆకుల ఔషధం రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే తులసి ఆకులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతంగా పని చేస్తాయి. తులసి ఆకులు, ఉసిరి పొడి, మెంతి పొడి కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్ తో అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. తులసి, ఉసిరి, మెంతి పొడి పేస్ట్ ముందుగా తులసి ఆకుల పొడిని ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో ఉసిరి పొడిని మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దానిలో నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కాసిన్ని మెంతులు వేసి.. ఆ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే మళ్ళీ ఆ పేస్ట్ లో కాస్త బాదం లేదా కొబ్బరి నూనె వేసి కుదుళ్లకు బాగా పట్టించాలి. ఇలా నెలకు ఒకసారి చేయడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. Also Read: Anupama Parameswaran : లిప్ లాక్ సీన్స్ లో నటించడం తప్పేమీ కాదు..! వైరలవుతున్న అనుపమ కామెంట్స్ #hair-growth-tips #tulasi-leaves #tulsi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి