Tulasi leaves: జుట్టు రక్షణకు తులసి మంత్రం.. ఆకులతో ఇలా చేయండి

ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా తరచూ జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలతో సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

Tulasi leaves: జుట్టు రక్షణకు తులసి మంత్రం.. ఆకులతో ఇలా చేయండి
New Update

Tulasi leaves: మన జుట్టును రక్షించుకునేందుకు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మార్కెట్‌లో దొరికే షాంపులు, కండీషనర్లతో పాటు ఇంట్లో దొరికే వాటితోనూ జుట్టును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తాం. అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం ఇంట్లో నిత్యం పూజించుకునే మొక్క అయిన తులసితో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సాధారణంగా జుట్టు ఊడిపోవడం అనేది ఏడాది పొడవునా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ వర్షాకాలంలో అయితే జుట్టు రాలడం చాలా ఎక్కువగా ఉంటుంది. చుండ్రు, హార్మోన్లలో మార్పుల వల్ల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే తులసి ఆకులను వాడాలని వైద్య నిపుణులు అంటున్నారు.

జుట్టు, చర్మం ఆరోగ్యానికి ఆకులు అద్భుతం

మనం ఎంతో పవిత్రమైన మొక్కగా భావించే తులసి ఆకుల్లో చాలా యాంటీబయోటిక్ లక్షణాలు నిక్షిప్తమై ఉంటాయి. జుట్టుతో పాటు చర్మం ఆరోగ్యానికి ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టుకు కావాల్సిన ప్యాక్‌ తయారీ కోసం.. కొన్ని తులసి ఆకులను మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఈ పేస్టును వెంట్రుకల కుదుళ్లకు బాగా పట్టించి కొద్దిసేపు అలాగే ఉంచాలి. పేస్ట్ ఆరిన తర్వాత ఒక తేలికైన షాంపూతో తలను శుభ్రంగా కడుక్కోవాలి. వారంలో ఒకసారి ఇలా పేస్ట్‌ను తలకు పట్టించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మన జుట్టుకు క్రమం తప్పకుండా నూనెను రాయడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నూనెను ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని బాగా తగ్గుతుంది

తులసి ఆకుల నుంచి తీసిన నూనె జుట్టుకు ఎంతో మంచిదని చెబుతున్నారు. దీన్ని రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుంది. కనీసం వారానికి మూడుసార్లు తులసి ఆకుల నూనెతో తలకు బాగా మర్దనా చేసుకుంటే రక్తప్రసరణ బాగా అవుతుంది. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. అంతేకాకుండా మన వెంట్రుకలు కూడా తెల్లగా మారకుండా ఉంటాయి. ఉసిరికాయ పొడి, తులసి ఆకుల పొడిని రాత్రంతా నానబెట్టి ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత అరగంట ఆగాక కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలడాన్ని బాగా తగ్గించుకోవచ్చు. మామూలుగా వెంట్రుకలు రాలడానికి ముఖ్యమైన కారణం చుండ్రు. చుండ్రు నుంచి బయటపడటానికి పెరుగులో కొంచెం తులసి ఆకుల నుంచి తీసిన రసాన్ని వేసి పేస్టులా కలుపుకోవాలి. ఆ పేస్టును తలకు పట్టించి కాసేపు ఉంచుకుని కడుక్కోవాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గడంతో పాటు వెంట్రుకలు రాలడం కూడా ఆగుతాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో పంపుల నుంచి నీళ్లు లీకైతే..వాస్తుపరంగా నష్టమా..?

#tulasi-leaves #helth-benefits #hair-protection
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe