Tula Uma: బీజేపీలో ఇక ఉండలేను.. ఆ పార్టీలోకి తుల ఉమ?

టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్న బీజేపీలో ఇక ఉండేలనంటూ తుల ఉమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేటీఆర్ ఆమెకు ఫోన్ చేయగా.. ఏఐసీసీ నేత ఒకరు ఉమ నివాసానికి కాసేపట్లో వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీ మార్పు కన్ఫామ్ అని తెలుస్తోంది.

New Update
Tula Uma: బీజేపీలో ఇక ఉండలేను.. ఆ పార్టీలోకి తుల ఉమ?

Tula Uma: టికెట్ ప్రకటించి.. ఆఖరి నిమిషంలో తన పేరును మార్చడంతో బీజేపీ నేత తుల ఉమ (Tula Uma) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆమె పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరుతారా? లేదా తిరిగి సొంత గూడు బీఆర్ఎస్ (BRS) లోకి వెళ్తారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే తుల ఉమకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నుంచి ఫోన్ వెళ్లినట్లు సమాచారం. మరో వైపు కాంగ్రెస్ నేతలు కూడా తుల ఉమకు టచ్ లోకి వచ్చారంటూ ప్రచారం సాగుతోంది. కాసేపట్లో ఏఐసీసీ నేత ఒకరు తుల ఉమ ఇంటికి వెళ్తారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఉమ కాంగ్రెస్ లోకే వెళ్లేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. అయితే.. ఉమను బుజ్జగించేందుకు ఈటల రాజేందర్ (Etela Rajender) చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయన ఫోన్ చేసినా.. ఉమ లిఫ్ట్ చేయలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో తనకు అన్యాయం చేశారని.. ఇంత జరిగినా రాష్ట్ర నాయకత్వం తనతో మాట్లాడలేదని ఉమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇంత అవమానించిన బీజేపీలో ఇక ఉండేలేనంటూ ఆమె స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.

Also Read: ఎన్నికల వేళ రొడ్డెక్కిన డబుల్ డెక్కర్ బస్సులు.. ప్రయాణం ఉచితం..

తుల ఉమకు మొదట వేములవాడ (Vemulawada) టికెట్ ను ప్రకటించింది బీజేపీ. అయితే.. ఏమైందో తెలియదు కానీ అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని వికాస్ కు ఆ టికెట్ ను కేటాయించింది. దీంతో తుల ఉమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న విలేకరులతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు