ఐదు రోజులు ధర్నా చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు By Vijaya Nimma 16 Jun 2023 in తెలంగాణ New Update షేర్ చేయండి జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈనెల 12న ఆందోళనకు దిగారు. వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్సిటీలో ధర్నాలు చేస్తే తప్ప జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. వీసీ రవీందర్ గుప్తా తీరు వల్లే తమకు జీతాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళన విషయంపై ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ కనకయ్య మాట్లాడుతూ జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ. 3.25 కోట్లు వచ్చాయన్నారు. బ్యాంక్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయడం లేదన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో కొనసాగుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతునే ఉంది. నేడు 5 వ రోజు కూడా విధుల బహిష్కరించి ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు ఆపొద్దంటూ బ్యాంక్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పట్టించుకోకుండా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి