TTD : తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేటి నుంచి ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల..!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి సేవకు సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది.

TTD : టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు
New Update

TTD Devotees Alert : తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. స్వామివారి సేవకు సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల (Arjitha Seva Tickets) కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనుంది. ఇందుకు ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. ఈ మూడురోజుల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా పలు ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ కేటాయించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.

ఎలక్ట్రానిక్ డిప్‌ (Electronic Dip) లో ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి 22న మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్దేశిత నగదు చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, దీపాలంకార సేవల్లో వర్చువల్‌గా పాల్గొనే భక్తుల కోసం ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనున్నారు.

అంగప్రదక్షిణం టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్‌, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు విడుదల చేయనున్నది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. తిరుపతి, తిరుమలలో వసతి గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు కోటా విడుదల చేయనుంది. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also read: తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం!

#tirumala #ttd #ttd-arjitha-seva-tickets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe