TTD: ఎమ్మెల్యే కోటా ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచిన ప్రభుత్వం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు.

New Update
TTD: ఎమ్మెల్యే కోటా ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు పెంచిన ప్రభుత్వం

సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు విహరించారు. స్వామి వాహన సేవను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నశేష వాహనం పైనుంచి స్వామివారు భక్తులందరికి అభయ ప్రదానం చేశారు.

ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు

తిరుమల శ్రీవారిని సీఎం జగన్‌ దర్శించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇస్తికఫాల్‌ మర్యాదతో స్వాగతం పలికారు టీటీడీ ఆలయ అధికారులు. ఆ తర్వాత దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు.

ఎమ్మెల్యే కోటా 10 మందికి  దర్శనాలు 

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పారు. ఎమ్మెల్యే కోటా క్రింద టీడీపీ దర్శనాలు పెంచిన ప్రభుత్వం పేర్కొంది. ఎమ్మెల్యే కోటా క్రింద రోజుకు 10 మందికి సుపధం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించారు. తిరుమల శ్రీవారి దర్శనాల బ్రేక్ దర్శనం గతంలో శుక్ర, శని, ఆదివారాలలో తమ కోటా క్రింద ఉండేవి కావు. ఇప్పుడు శుక్రవారం మినహా వారంలో అన్ని రోజులూ బ్రేక్ దర్శనాలును పొందే సౌకర్యం కల్పించిన సీఎం జగన్‌ ప్రభుత్వం.

Advertisment
Advertisment
తాజా కథనాలు