TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి లడ్డూపై ఆంక్షలు..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూప్రసాదాలపై ఆంక్షలు విధించింది. దర్శన టికెట్, ఆధార్‌కార్డ్‌ ఉన్నవారికే శ్రీవారి లడ్డూలు ప్రసాదించనుంది. ఒకరికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉంటేనే అదనపు లడ్డూ ఇస్తారని తెలుస్తోంది.

New Update
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి లడ్డూపై ఆంక్షలు..!

TTD Key Decision On Tirumala Laddu : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎంతో ప్రియమైన లడ్డూలపై ఆంక్షలు విధించింది. దర్శన టికెట్, ఆధార్‌కార్డ్‌ (Aadhaar Card) ఉన్నవారికి మాత్రమే శ్రీవారి లడ్డూలు ప్రసాదించనుంది. తిరుమలలో అమల్లోకి ఈ నూతన విధానం తీసుకురానుంది. శ్రీవారి లడ్డూప్రసాదాలను బ్లాక్‌ మార్కెట్‌ చేసే దళారులను నియంత్రించేందుకు టీటీడీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీలో సంచలనంగా ముంబై హీరోయిన్ జెత్వాని కేసు..!

ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్‌పై ఒక ఉచిత లడ్డూ మాత్రమే ఇవ్వనుంది. ఆధార్‌కార్డ్‌ ఉంటేనే మరో లడ్డూను ప్రసాదించనుంది. టోకెన్‌ ఉన్నవారికే మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను.. 4 నుంచి 6 వరకు కొనుక్కొనే వెసులుబాటు కల్పించనుంది. ఆధార్‌కార్డ్‌ నంబర్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాతే లడ్డూ ఇవ్వనుంది. అదనపు లడ్డూలు (Laddu) కొనుగోలుకు వారికి అవకాశం ఉండదని టీటీడీ తేల్చి చెప్పింది.

Also Read: ఏపీలో సంచలనంగా ముంబై హీరోయిన్ జెత్వాని కేసు..!

అయితే, ఈ నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తిరుమలలో డబ్బులు చెల్లిస్తే ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలైనా ఇచ్చేవారు. కానీ, లడ్డూల తయారీలో ఇబ్బందులు.. రోజుకు లక్షల్లో శ్రీవారి భక్తులు వచ్చి లడ్డూలు తీసుకోవడంతో మిగితా భక్తులకు లడ్డూల కోరత కలుగుకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు