TTD Jobs: టీటీడీలో ఆ పోస్టులకు ఖాళీలు..మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి!

టీటీడీలోని డిగ్రీ/జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు 78. ఇందులో డిగ్రీ లెక్చరర్‌ లు 49 , జూనియర్‌ లెక్చరర్లు 29 ఉన్నాయి

New Update
TTD Jobs: టీటీడీలో ఆ పోస్టులకు ఖాళీలు..మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి!

Ap Government: ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. టీటీడీ (ttd)లో పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీటీడీలోని డిగ్రీ/జూనియర్‌ లెక్చరర్‌ (lecturer) పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం (ap govt)తెలిపింది. ఈ ఉద్యోగాలకు సరిపోయే అర్హతలు, జీతభత్యాల గురించి వివరించింది.

డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు..

టీటీడీలో మొత్తం డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు 78. ఇందులో డిగ్రీ లెక్చరర్‌ లు 49 , జూనియర్‌ లెక్చరర్లు 29 ఉన్నాయి. డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. బోటనీ-3, కెమిస్ట్రీ 2, కామర్స్‌ 9, డెయిరీ సైన్స్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 1, ఇంగ్లీష్‌-8, హిందీ 2, హిస్టరీ 1, హోమ్‌ సైన్స్‌ 4, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌-2, ఫిజిక్స్‌ -2, పాపులేషన్ స్టడీస్‌-1, సంస్కృతం-1, సంస్కృత వ్యాకరణం-1, స్టాటిస్టిక్స్-4, తెలుగు -3, జువాలజీ-4 పోస్టులకు టీటీడీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

55 శాతం మార్కులతో...

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే..కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. అంతేకాకుండా నెట్‌/స్లెట్ కూడా అర్హత సాధించి ఉండాలి.

జూనియర్‌ లెక్చరర్‌ ల పోస్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు..బోటనీ-4,కెమిస్ట్రీ-4,సివిక్స్‌-4, కామర్స్‌ -2, ఇంగ్లీష్‌-1,హిందీ-1, హిస్టరీ-4, మ్యాథ్స్‌ -2, ఫిజిక్స్‌ -2, తెలుగు-3,జువాలజీ-2 పోస్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి జులై 1 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఉండగా... దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి ఉంది.

ఇక జీతభత్యాల విషయానికి వస్తే..నెలకు డిగ్రీ లెక్చరర్‌ కు రూ. 61,960 నుంచి రూ. 1,52,370 వరకు ఉంటుంది. జూనియర్‌ లెక్చరర్‌ కు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 కు ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా కూడా సెలెక్ట్‌ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రారంభమవుతాయి. వెబ్‌సైట్‌: https://www.tirumala.org/ ద్వారా ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు.

Also read: 7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు