TTD EO: విఐపీలకు షాక్.. స్వయంగా వస్తేనే స్వామి దర్శనం: టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

వైకుంఠద్వార దర్శనానికి వచ్చే రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వివిఐపీలు, విఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని తేల్చి చెప్పారు.

New Update
TTD EO: విఐపీలకు షాక్.. స్వయంగా వస్తేనే స్వామి దర్శనం:  టీటీడీ ఈఓ ధర్మారెడ్డి

TTD EO Dharma Reddy: తిరుమలలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైకుంఠద్వార దర్శనానికి వచ్చే రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసామని వెల్లడించారు. ఈనెల 23వ తేదీ వేకువజామున 1:45 గంటలకు వైకుంఠద్వార దర్శనం మొదలవుతుందని..ముందుగా ప్రముఖులు దర్శించుకున్నాక..సామాన్యభక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 2024 జనవరి 1వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు వైకుంఠద్వారాలు తెరచి ఉంచబడతాయని చెప్పారు.

Also read: జనసేనకు షాక్.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు.!

ఆ 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠద్వార ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటుందని కామెంట్స్ చేశారు. 10 రోజులలో ఏ రోజు దర్శించుకున్నా భక్తులకు మోక్షప్రాప్తి కలుగుతుందన్నారు. అయితే, ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వివిఐపీలు, విఐపీలు స్వయంగా వస్తేనే దర్శనం కల్పిస్తామని తేల్చి చెప్పారు. ఈ 10 రోజుల పాటు దర్శనానికి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఖరకండిగా చెప్పేశారు.

Also read: ‘సమస్యలు పరిష్కరించాల్సిందే’.. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించిన అంగన్వాడీలు.!

వసతి సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రముఖులు తిరుపతిలో బస చేయాలని విజ్ఞప్తి చేశారు. 22వ తేదీన తిరుపతిలోని 9 ప్రాంతాల్లో 90 కౌంటర్ల ద్వారా 4.25 లక్షల సర్వదర్శనం టోకన్లు జారీ ప్రారంభిస్తామని వెల్లడించారు. కోటా పూర్తి అయ్యేవరకు భక్తులకు టోకన్లు కేటాయిస్తామని తెలిపారు. టోకెన్ సమయానికి 24 గంటల ముందు మాత్రమే భక్తులు తిరుమలకు రావాలన్నారు. టోకెన్ లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తాం..కానీ దర్శనం, గది లభించదని చెప్పారు.దర్శనం టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే అద్దెగది కేటాయిస్తామని వ్యాఖ్యనించారు.ఈ క్రమంలోనే 23న వైకుంఠ ఏకాదశి నాడు ఉ 9 గంటకు శ్రీవారి స్వర్ణరథం అని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు