నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై...!

నాస్తికుడంటూ తనపై విమర్శలు చేస్తున్న వారికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాను విమర్శలకు భయపడే వాడిని కాదన్నారు. తాను 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినన్నారు. మతాంతీకరణలు ఆపేందుకు కళ్యాణమస్తు ద్వారా సుమారు 30 వేల మందికి సామూహిక వివాహాలు చేయించానని భూమన వెల్లడించారు.

New Update

తిరుపతిలో నిర్వహించిన ‘మూడు తరాల మనిషి’ పుస్తకావిష్కరణ సభలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నది తానేనని చెప్పారు. అన్నమయ్య 600వ వర్ధంతి ఉత్సవాలను తానే నిర్వహించానని గుర్తు చేశారు. దళిత వాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది తానేనని చెప్పుకొచ్చారు.

క్రిస్టియన్ అంటూ తనపై ఆరోపణలు చేసే వారికి ఇదే తన సమాధానం అన్నారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వ్యక్తిత్వం తనది కాదన్నారు. పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తిని తానన్నారు. ఇలాంటి ఆరోపణలకు తాను భయపడబోనన్నారు. అనంతరం టీటీడీ ఈవో ధర్మా రెడ్డి మాట్లాడారు. తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బ తీసేలా కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, భక్తుల కోసం కల్పించిన వసతులపై నెల రోజుల్లో మహతిలో పీపీటీ ప్రదర్శన ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీటీడీ మీద విమర్శలు చేస్తున్న వారిలో తిరుపతి వాసులు కూడా ఉండటం శోచనీయమన్నారు. టీటీడీని తిరుపతి వాసులు తమ సొంతంగా భావించాలన్నారు. దేవుడి దయ వల్లే తిరుపతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు