TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. నడకమార్గంలో వాటికి నో పర్మిషన్!!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇటీవల జరిగిన క్రూర మృగాల దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపాయి. ఈ క్రమంలో టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖల అధికారులతో సహా దుకాణదారుల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు. తిరుమల నడక దారుల్లో క్రూర మృగాల కదలికలు ఉన్న నేపథ్యంలో భక్తులు భద్రత దృష్ట్యా.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు పలు సూచనలు చేశారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు వందకు పైగా తినుబండారాలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు.

TTD Key Decision: టీటీడీ కీలక నిర్ణయం.. నడకమార్గంలో వాటికి నో పర్మిషన్!!
New Update

TTD Bans Fruits and Vegetables Sale on Footpath routes: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇటీవల జరిగిన క్రూర మృగాల దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపాయి. ఈ క్రమంలో టీడీపీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖల అధికారులతో సహా దుకాణదారుల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు. తిరుమల నడక దారుల్లో క్రూర మృగాల కదలికలు ఉన్న నేపథ్యంలో భక్తులు భద్రత దృష్ట్యా.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు పలు సూచనలు చేశారు.

తిరుమలకు వెళ్లే నడకమార్గాల్లో విక్రయాలను సంబంధించిన విషయాలపై అటవీ, ఎస్టేట్, ఆరోగ్యశాఖల అధికారులతో సహా భక్తులకు కూడా సూచనలు చేసినట్లు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. అలిపిరి నడక మార్గంలో దాదాపు వందకు పైగా తినుబండారాలను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు. భక్తులు వీటిని కొనుగోలు చేసి.. సాధు జంతువులకు తినిపించడం వల్ల పులుల రాక పెరుగుతోందని ఈవో తెలిపారు. దీని వల్ల ఈ జంతువుల కోసం క్రూరమృగాలు అటువైపు వస్తున్నాయని.. అలాగే భక్తులపై కూడా దాడులు చేస్తున్నాయని ఆయన వివరించారు.

అలాగే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చెత్తకుండీల్లో వేయాలని సూచించారు. నడక మార్గంలో రోజుకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు చెత్త పోగవుతోందని తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక పై నుంచి క్రూర మృగాల జాడ కనిపిస్తే వెంటనే తెలిపేందుకు వీలుగా అటవీ, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నెంబర్లు కూడా నడక మార్గాల్లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు ఈవో ధర్మారెడ్డి.

ఇదిలా ఉండగా ఇటీవల శ్రీవారి భక్తులపై చిరుత పులులు దాడులకు పాల్పడినటువంటి ఘటనలు ఇప్పుడు భక్తుల్లో మరింత ఆందోళనలు పెంచాయి. అయితే కాలినడకన వెళ్లే భక్తులపై ఇటీవల రెండు క్రూరమృగాల దాడులు జరిగిన విషయం తెలిసిందే. అలాగే నెల రోజుల క్రితమే కౌషిక్ అనే బాలుడ్ని చిరుత దాడి చేసింది. ఇటీవల లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మృతి చెందడంతో శేషాచలం అడవుల్లో పులుల సంచారంపై ఆందోళన మరింత పెరిగింది. ఆ బాలికపై దాడి జరిగిన తర్వాత టీటీడీ కాలినడక మార్గాల్లో దాదాపు 320కి పైగా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 36 బోన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే 50 రోజుల్లోనే ఆ బోన్లో మూడు చిరుతలు చిక్కాయి. అలాగే కెమెరాల్లో కూడా మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ చిరుత దాడుల ముప్పు లేకుండా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

#tirupathi #ttd #ttd-eo-dharma-reddy #wild-animals #ttd-bans-fruits-and-vegetables #fruits-and-vegetables-sale #footpath
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe