TTD: ఈ ఏడాది స్వామి వారికి రెండు బ్రహ్మోత్సవాలు!

తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు

TTD: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ..సర్వ దర్శనం నిలిపివేత!
New Update

TTD Brahmotsavam: తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

ఈ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలకు గతేడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నట్లు టీటీడీ (TTD) అధికారులు అంచనా వేస్తున్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు, అక్టోబ‌రు 15 నుంచి 23వ తేదీ వ‌ర‌కు కొన్ని ప్రత్యేక సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

సాలకట్ల బ్రహ్మోత్సవాలు:

సెప్టెంబ‌రు 18 - ధ్వజారోహణం

సెప్టెంబ‌రు 22 - గ‌రుడ వాహ‌న సేవ

సెప్టెంబరు 23 - స్వర్ణ రథం

సెప్టెంబ‌రు 25 - రథోత్సవం (మ‌హార‌థం)

సెప్టెంబ‌రు 26 - చక్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణం

న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు:

అక్టోబ‌రు 19 - గ‌రుడ‌వాహ‌న సేవ

•అక్టోబ‌రు 22 - స్వర్ణరథం

అక్టోబ‌రు 23 - చక్రస్నానం

ఈ క్రమంలో రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కొన్ని సేవలను తిరుమల తిరుపతి అధికారులు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అష్టాదళ‌ పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావడై, క‌ళ్యాణోత్సవం, ఊంజ‌ల్‌ సేవ‌, స‌హ‌స్రదీపాలంకార సేవ‌లను రద్దు చేస్తున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు.

బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబర్‌ 18 నుంచి 26, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా భక్తులు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవా టికెట్లను కానీ బుక్‌ చేసుకుని ఉన్నట్లయితే భక్తులను కేవలం ఆ వాహన సేవకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార‌ణంగా అక్టోబ‌రు 14న సహస్రదీపాలంకార సేవను ర‌ద్దు చేసినట్లు వెల్లడించింది.

Also Read: ఈ నెల 28 న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..ఎందుకంటే!

#tirumala-srivari-brahmotsavams #tirupati-brahmotsavam-2023 #tirumala-brahmotsavam-2023 #ttd-brahmotsavam #brohmatsavam #tirumala-tirupati #andhrapradesh #tirumala-brahmotsavam-2023-dates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe