తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్స్.. పూర్తి అర్హతలివే

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యాసంవత్సరం అడ్మిషన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 5వ తరగతిలో ప్రవేశాలకు 2024 జనవరి 6వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. ఫిబ్రవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణ గురుకులాల్లో అడ్మిషన్స్.. పూర్తి అర్హతలివే
New Update

2024-25 విద్యాసంవత్సరానికిగానూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నోటిఫికేషన్ తో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. అయితే ఈ అవకావం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు మరో రెండు వారాల్లోకి అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 4తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. ఈ అడ్మిషన్స్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 6వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవాలి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థతో పాటు, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో అడ్మిషన్స్ కల్పించనుండగా.. 2024 ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి :  మొదలైన గ్రూప్ 2 అప్లికేషన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే

విద్యార్థి వయసు :

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9-13 ఏళ్ల మధ్య ఉండాలి. ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9-11 ఏళ్ల వయసుండాలి.

వార్షికాదాయం :

ఈ అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకునే విద్యార్థి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతం రూ.1.50,000, పట్టణ ప్రాంతం రూ.2,00,000లకు మించి ఉండకూడదు.

పరీక్ష విధానం :

ప్రవేశ పరీక్ష 100 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో రాసుకునే వెలుసుబాటు ఉంటుంది. తెలుగు 20 మార్కులు, ఇంగ్లిష్ 25 మార్కులు, గణితం 25 మార్కులు, మెంటల్‌ ఎబిలిటీ 10 మార్కులు, పరిసరాల విజ్ఞానం 20 మార్కులు. ప్రతి సబ్జెక్టులోనూ 4వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు :

ఆన్‌లైన్‌ విధానంలోనే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు.

#2024-25 #tswreis #admissions
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe