/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Electric-AC-Buses--jpg.webp)
TSRTC Electric AC Buses: సరికొత్త నిర్ణయాలు, మార్పులతో ఆర్టీసీని (TSRTC) ప్రజలకు చేరువ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (MD Sajjanar). తాజాగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను ఈ నెల 15వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: ‘దటీజ్ కేసీఆర్’.. ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఎంపీ సంతోష్..
ప్రయాణికులకు శుభవార్త! సికింద్రాబాద్-పటాన్ చెరు మార్గంలో ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సులను #TSRTC వాడకంలోకి తెచ్చింది. శుక్రవారం (తేది:15.12.2023) నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. ఈ రూట్ లో ప్రతి 24 నిమిషాలకో ఏసీ మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 219 రూట్ నెంబర్ గల ఈ… pic.twitter.com/H213nRAwmW
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 13, 2023
ఈ రూట్ లో ప్రతీ 24 నిమిషాలకు ఓ ఏసీ మెట్రో బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. 219 రూట్ నెంబర్ గల ఈ బస్సులు.. పారడైస్, బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి మీదుగా పటాన్ చెరు చేరుకుంటాయని వివరించారు. తిరిగి అదే మార్గంలో సికింద్రాబాద్ కు చేరుకుంటాయన్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సజ్జనార్.