హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ (TSRTC). భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్ - 9959226154, కోఠి బస్ స్టేషన్ - 9959226160 నంబర్లను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.
ఇదిలా ఉంటే.. రానున్న 5 నెలలు సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది, అధికారులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. వచ్చే నెల నుంచి దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ మేరకు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని సూచించారు.
పండుగ సీజన్ సన్నద్దత, క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, తలెత్తుతున్న సమస్యలు, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉద్యోగులందరితో ఇటీవల ఆయన వర్చ్‌వల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. 20 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సిబ్బందికి ఆర్టీసీ దిశానిర్ధేశం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను డ్రైవర్లు, కండక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
Ganesh Nimajjanam 2023: మద్యం తాగి నిమజ్జనానికి రావొద్దు.. 25 వేల మందితో భారీ బందోబస్తు.. సీపీ కీలక ప్రకటన