TSPSC Group-2: గ్రూప్-2 పరీక్షపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు.. మరో నెల రోజుల్లోనే ఎగ్జామ్..!!

గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 6,7తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది.

New Update
TSPSC Group 1: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం లేఖ రాశారు. వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. పలు కారణాలతో రాష్ట్రంలో గత సర్కార్ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్పీఎస్సీని ప్రకాక్షళన చేయాలన్ని డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం ఉన్న కమిషన్ పై తమకు నమ్మకంలేదంటూ..కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన ఫిర్యాదులు, డిమాండ్ల మేరకు తాము మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు చేస్తామని గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసి నియామకాలను చేపడతామని పేర్కొంది. అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్లకు టీఎస్పీఎష్సీ సెక్రటరీ లేఖ రాయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. ఎంట్రెన్స్ లేకుండానే ఎంటెక్ లోకి:

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ఎంటెక్ లో ప్రవేశాలు కల్పించే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని కాలేజీలు. రాష్ట్రంలోని కొన్ని పీజీ ఇంజనీరింగ్ కాలేజీలు కోర్సులకు ప్రవేశపరీక్షలేకుండా ప్రవేశాలు కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 6 పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో కొన్ని పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. అందులో టెక్స్ టైల్ టెక్నాలజీ, ఎరోనాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రవేశాలు కల్పించే విధానంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీలో జేన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీ నారాయణ, పీజీఈసెల్ పూర్వ కన్వీనర్ రవీంద్రారెడ్డిలు ఉన్నారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుండగా…వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలను ఆమోదించినట్లయితే జీవో జారీ అవుతుంది. ఈ మేరకు 2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. పీజీఈసెట్ ను మొత్తం 19 సబ్జెక్టులకు నిర్వహిస్తున్నారు. పలు కోర్సుల్లో సీట్లు ఎక్కువగా ఉండటం, ప్రవేశ పరీక్షకు హాజరయ్యేవారు తక్కువగా ఉండటంతో ఈ దిశగా అడుగులేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి.

కాగా బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీఈసెట్ పరీక్షా విధానం మార్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 2004లో ఇచ్చిన జీవో 168 ప్రకారం అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ ఈవెంట్స్ కు బదులుగా రాతపరీక్షను నిర్వహించే అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ రాజేశ్ లు సభ్యులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!!

Advertisment
తాజా కథనాలు