/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/TSPSC-jpg.webp)
TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై సోమవారం కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను వెల్లడించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మధ్యే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ను అదే రోజు రద్దు చేసిన కొద్ది గంటల్లోనే కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా షురూ అయ్యింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా...ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు ఆన్ లైన్ లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించున్నట్లు తెలిపింది. తాజాగా జూన్ 9 న ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది టీఎస్‌పీఎస్సీ.
#Telangana: #TSPSC #Group1 prelims exam on 9th June 2024 pic.twitter.com/itPqbfi4uW
— L Venkat Ram Reddy (@LVReddy73) February 26, 2024
ఇది కూడా చదవండి: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన ..పరీక్ష తేదీ ఖరారు.!