TSPSC Group-4 Results: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ కీ, రిజల్ట్స్ పై కీలక అప్టేట్.. విడుదల ఎప్పుడంటే?

తెలంగాణలో గ్రూప్-4 ఫైనల్ కీని మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.

TSPSC Group-1 Updates: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ.. విచారణ ఎప్పుడంటే?
New Update

తెలంగాణలో దాదాపు 7 లక్షలకు పైగా అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రూప్-4 ఫలితాలపై (tspsc group-4) అప్టేట్ వచ్చేసింది. ఈ రిజల్ట్స్ ను అక్టోబర్ లో విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ (tspsc) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫైనల్ కీని మరో పది రోజుల్లో విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 1వ తేదీన ఇందుకు సంబంధించిన పరీక్షను నిర్వహించగా మొత్తం 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు మొత్తం 2878 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయగా.. పేపర్‌-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు సంబంధించి మొత్తం 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఈ పరీక్ష ప్రైమరీ కీని ఆగస్టు 28న విడుదల చేసింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఈ ప్రైమరీ కీపై అభ్యంతరాల స్వీకరణ జరిగింది.

ఈ అభ్యంతరాలపై టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. పూర్తి స్థాయిలో పరిశీలించి కమిషన్ కు నివేదిక అందించినట్లు సమాచారం. ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మరో పది రోజుల్లో ఫైనల్ కీని విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది. అనంతనం ఫైనల్ రిజల్ట్స్ ను అక్టోబర్ నెలాఖరులోగా విడుదల చేయాలన్నది టీఎస్పీఎస్సీ ఆలోచనగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గ్రూప్-4 ఫలితాలు ఆలస్యం కావడంపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పరీక్ష నిర్వహించిన దాదాపు రెండు నెలలకు ప్రైమరీ కీని విడుదల చేయడం, ఇంకా ఫైనల్ కీని విడుదల చేయకపోవడం సరికాదని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని వానే కోరుతున్నారు.

#government-jobs #tspsc-group-4 #tspsc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe