Group 2: వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు జరగనుంది? కొత్త తేదీలు ఎప్పుడో తెలుసా? వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల కొత్త డేట్స్‌ని టీఎస్పీఎస్సీ(TSPSC) ఇవాళ(ఆగస్టు 13) ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌కు వాయిదా పడుతాయని సమాచారం ఉన్నా.. తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు(ఆగస్టు 14)న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరుస పెట్టి ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో.. సిలబస్‌లు వేరువేరు కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన డిమాండ్‌తో ప్రభుత్వం తలొగ్గింది. By Trinath 13 Aug 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి అభ్యర్థుల నిరసనలకు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న సర్కార్.. ఈ నెల(ఆగస్టు) 29, 30 జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ తెలిపినట్లు చెప్పారు కేటీఆర్. ప్రతి అభ్యర్ధి అర్హత ఉన్న అన్నీ పరీక్షలు రాసే విధంగా తగిన సమయం ఉండాలని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సెక్రటరీలతో సమీక్షించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గ్రూప్-2 పరీక్షల విషయమై అన్ని విషయాలు సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఎగ్జామ్స్‌ని వాయిదా వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే వాయిదా డేట్లకు సంబంధించి కమిషన్ నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. అది ఇవాళే(ఆగస్టు 13) రావొచ్చు. మరోవైపు రేపు(ఆగస్టు 14)కూడా గ్రూప్ 2 వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. విచారణ ప్రారంభం అయ్యేలోపే కొత్త డేట్లను కూడా టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. Hon’ble CM KCR Garu has directed the Chief secretary to consult with TSPSC and reschedule the Group-2 exam to ensure no inconvenience is caused to the lakhs of aspirants He has also advised the Chief secretary to ensure proper staggering of the recruitment notifications in… — KTR (@KTRBRS) August 12, 2023 కొత్త తేదీలు ఎప్పుడు? ఈ నెల చివరిలో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను నవంబర్‌లో జరపాలని TSPSC భావిస్తున్నట్టు సమాచారం. అసలు అభ్యర్థులు నిరసనలు చేయడానికి ప్రధాన కారణం.. వరుస పెట్టి పరీక్షలు నిర్వహించడం. గ్యాప్ లేకుండా ఒక ఎగ్జామ్ తర్వాత మరో ఎగ్జామ్ ఉండడం.. అసలు దేనికి ప్రిపేర్ అవ్వాలో.. ఏ పరీక్షకు టైమ్ కేటాయించాలో తెలియకపోవడం. ఒక్క పరీక్షకు మరో పరీక్షకు మధ్య సిలబస్‌లో డిఫెరెన్స్ ఉంటుంది. ఒక దానికి ప్రిపేర్ అయితే అన్ని పరీక్షలు రాసేయచ్చు అన్నది పెద్ద అబద్ధం. ఇది అభ్యర్థులకు తెలుసు. అందుకే కొన్ని నెలల ముందే గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని TSPSCని కోరినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నాయి. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. TSPSC కార్యాలయాన్ని ముట్టడించాయి. దీంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడం మినహా ప్రభుత్వానికి మరో దారి లేకుండా పోయింది. హైకోర్టులో రేపు విచారణ: ఇక గతంలో 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. వరుస పెట్టి పరీక్షలు ఉన్నాయని.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఒక్క ఆగస్టులో పోటీ పరీక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి గురుకుల పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21 వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి తోడుగా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉన్నాయి. సిలబస్‌లు వేరువేరు కావడంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు అభ్యర్థులు. #ktr #cm-kcr #group-2-exams #tspsc #tspsc-group-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి