Group 2: వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు జరగనుంది? కొత్త తేదీలు ఎప్పుడో తెలుసా?
వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల కొత్త డేట్స్‌ని టీఎస్పీఎస్సీ(TSPSC) ఇవాళ(ఆగస్టు 13) ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌కు వాయిదా పడుతాయని సమాచారం ఉన్నా.. తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రేపు(ఆగస్టు 14)న గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో కూడా విచారణ జరగాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వరుస పెట్టి ప్రభుత్వ పరీక్షలు ఉండడంతో.. సిలబస్‌లు వేరువేరు కావడంతో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన డిమాండ్‌తో ప్రభుత్వం తలొగ్గింది.