TSPSC Job Notification : తెలంగాణ(Telangana) లో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు గత నెల టీఎస్పీఎస్సీ(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 19 నుంచి ఈ నెల 17వ తేదీకి వరకు కొనసాగింది. మొత్తం 4.03 లక్షల మంది గ్రూప్-1కు అప్లై చేసుకున్నారు. అయితే.. దరఖాస్తు సమయంలో ఏమైనా వివరాలు తప్పుగా నమోదు చేసుకుంటే వాటిని సవచించుకునే అవకాశాన్ని కల్పించింది టీఎస్పీఎస్సీ. ఈ రోజు నుంచి ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 27వ తేదీ.. అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ టీఎస్పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన అయ్యి తమ అప్లికేషన్ ను ఎడిట్ చేసుకోవచ్చు. తద్వారా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఫొటో, సంతకం తదితర వివరాల్లో తప్పులను సరి చేసుకోవచ్చు. అయితే.. ఇందుకు సంబంధించి ధ్రువపత్రాలను అభ్యర్థులు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : TET : టెట్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. టి-సాట్ లో ఫ్రీ క్లాసులు!
అప్లికేషన్ ఎడిట్ ఇలా..
Step 1: అభ్యర్థులు మొదటగా టీఎస్సీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో Group 1 Services Online Edit Application ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత లాగిన్ పేజీ లో టీఎస్పీఎస్సీ ఐడీ, డేటా ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి GET OTP ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Step 5: అక్కడ మీ వివరాలను సరి చూసుకుని.. ఏమైనా తప్పులు ఉంటు మార్చుకోవాలి.
Step 6: ఎడిట్ చేసిన వివరాలకు సంబంధించిన ధృవపత్రాలను సబ్మిట్ చేయాలి.