TSPSC Group-1 Updates: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ.. విచారణ ఎప్పుడంటే?

గ్రూప్ 1 పరీక్ష రద్దు పై (TSPSC Group-1 Exam Cancel) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ హైకోర్టులో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను రేపు విచారించనుంది ధర్మాసనం.

New Update
TSPSC Group-1 Updates: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ.. విచారణ ఎప్పుడంటే?

TSPSC Group-1: గ్రూప్ 1 పరీక్ష రద్దు పై (TS Group-1 Exam Cancel) సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీఎస్పీఎస్సీ (TSPSC) హైకోర్టులో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు (Telangana High Court) నిరాకరించింది. ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా.. బయోమెట్రిక్ నిబంధనలను పాటించలేదన్న కారణంతో ఈ నెల 23న గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రాసామని, టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందని అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ (TSPSC) అప్పీలుకు వెళ్లింది. పరీక్ష రద్దు అంశంపై అత్యవసర విచారణ కోసం లంచ్‌ మోషన్‌ అనుమతి కోరుతూ టీఎస్పీఎస్సీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను మంగళవారం విచారిస్తామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వెల్లడించింది. దీంతో మంగళవారం నాడు హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం నిరుద్యోగుల్లో ఉత్కంఠగా మారింది.

టీఎస్పీఎస్సీ వాదన ఇదే!
జూన్ 11న రెండో సారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు మొత్తం 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారని కోర్టుకు టీఎస్పీఎస్సీ విన్నవించనుంది. ఇందులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేవలం ముగ్గురి కోసం పరీక్షను మళ్లీ రద్దు చేస్తే మిగిలిన 2,33,503 మంది అభ్యర్థులు ఇబ్బంది పడతారని కోర్టుకు వివరించనుంది.
ఇది కూడా చదవండి: TSPSC Group-1 Exam: గ్రూప్-1 పరీక్ష రద్దుతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. టీఎస్పీఎస్సీ నెక్ట్స్ స్టెప్ ఇదే?

పరీక్ష రద్దు కారణంగా అభ్యర్థులపై ఆర్థిక భారం పడటంతో పాటు, వారి విలువైన సమయం కూడా వృథా అవుతుందని కోర్టు దృష్టికి తీసుకుపోనున్నారు టీఎస్పీఎస్సీ తరఫు లాయర్లు. ఇంకా.. గ్రూప్‌-1 నియామకాలకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రమే ముఖ్యం కాదని.. ఇందులో అర్హత సాధించిన వారంతా మళ్లీ మెయిన్స్ లో సత్తా చాలాల్సి ఉంటుందన్న విషయాన్ని కోర్టుకు ప్రధానంగా తెలపనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు