TSPSC: టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. వరుస నోటిఫికేషన్లు!

తెలంగాణలో ఉద్యోగార్థుల ఎన్నో రోజుల ఎదురుచూపులు మొత్తానికి ఫలించాయి. టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డు నియామకంతో ఇక వరుసగా నోటిఫికేషన్లు వెల్లువెత్తబోతున్నాయి. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

TSPSC: టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్‌.. వరుస నోటిఫికేషన్లు!
New Update

TSPSC: తెలంగాణలో ఉద్యోగార్థుల ఎన్నో రోజుల ఎదురుచూపులు మొత్తానికి ఫలించాయి. టీఎస్‌పీఎస్సీకి కొత్త బోర్డు నియామకంతో ఇక వరుసగా నోటిఫికేషన్లు వెల్లువెత్తబోతున్నాయి. చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై.రాంమోహన్‌రావును బోర్డు సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. దీంతో కొలువుల నియామక ప్రక్రియ ఊపందుకోబోతోంది. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసి, ఇంకా తేదీలు కూడా ప్రకటించకుండా ఉన్న చాలా నోటిఫికేషన్లకు ఇక లైన్‌ క్లియర్‌ అయినట్టే భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశ దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే

అదనపు పోస్టులతో గ్రూప్‌-1

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. మరోవైపు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ సహా బోర్డు నియామకంతో పాటు ఇతర ఏర్పా్ట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా, గ్రూప్‌ 1లో మరిన్ని పోస్టులు కలిపి పెద్దసంఖ్యలో ఉద్యోగాలతో అనుబంధ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అలా అయితే, కొత్తవారికి కూడా కొత్త పోస్టుల వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. 503 పోస్టులతో గత నోటిఫికేషన్‌ జారీ చేయగా, దాదాపు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, పేపర్‌ లీకేజీ వల్ల ఒకసారి రద్దవగా, నిర్వహణ లోపాల కారణంగా హైకోర్టు మరోసారి రద్దు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు అనుబంధ నోటిఫికేషన్‌ దిశగా ప్రభుత్వం ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పుష్కరకాలం తర్వాత వచ్చిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రశ్నపత్రం లీకేజీ, అనంతరం తిరిగి నిర్వహించడం, నిర్వహణ లోపాలతో మళ్లీ రద్దై సుప్రీంకోర్టుకు పోవడం వంటి పరిణామాలన్నీ తెలిసినవే.

ఏప్రిల్‌లో గ్రూప్‌-2?.. పోస్టులు కలుపుతారా!

రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండోసారి గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 783 పోస్టులకు దాదాపు ఐదున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌ 1 పేపర్‌ లీకేజీ అనంతరం జూన్‌లో జరగాల్సి ఉన్న గ్రూప్‌-2 పరీక్ష ఆగష్టుకు వాయిదా పడింది. అదే సమయంలో గురుకుల బోర్డు నియామక పరీక్షలు, జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షలు, ఇతర టీఎస్‌పీఎస్సీ పరీక్షలు కూడా ఉండడంతో వాయిదా కోసం అభ్యర్థులు పెద్దసంఖ్యలో టీఎస్‌పీఎస్సీ ఎదుట ఆందోళనకు దిగడంతో అది నవంబర్‌కు వాయిదా పడింది. అదే సమయంలో ఎన్నికలకు షెడ్యూలు రావడంతో టీఎస్‌పీఎస్సీ తిరిగి గ్రూప్‌ 2 పరీక్షను జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేసింది. అనంతరం టీఎస్‌పీఎస్సీ సభ్యుల రాజీనామాల నేపథ్యంలో పరీక్ష జరగలేదు. తాజాగా బోర్డు నియామకంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రకారం ఏప్రిల్‌ 1న గ్రూప్‌ నోటిఫికేషన్‌ ప్రకటించాల్సి ఉంది. దీనినే కొనసాగిస్తారా లేదంటే రద్దు చేసి కొన్ని పోస్టులు కలిపి కొత్తగా నోటిఫికేషన్‌ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి!

ఇంకా తేదీలు ప్రకటించని పరీక్షలు ఎన్నో!

గ్రూప్‌-3 తో పాటు హెచ్‌డబ్ల్యూవో, రద్దు చేసిన జేఏవో పరీక్షలు; వాటితో పాటు డీఎస్సీ వంటి ఇతర నియామక బోర్డులు నిర్వహించే పరీక్షలకు ఇప్పటికీ తేదీలు కూడా ప్రకటించలేదు. అయితే, ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మిగతా పరీక్షలపై కొత్త బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. వాటినే కొనసాగిస్తారా.. లేదంటే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌లు వెలువరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

గ్రూప్‌-4 రిజల్ట్స్‌ వెల్లడిస్తారా?

గ్రూప్‌ 4 ఫలితాలపైనా స్పష్టత లేదు. గతేడాది జూలై 1న పరీక్ష జరగగా, తుది కీ ని కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. సర్టిఫికేట్ల పరిశీలన, తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కొత్త బోర్డు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

#tspsc-group-1-updates #tspsc #tspsc-notifications
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe