/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Police-Recruitmen-jpg.webp)
TSLPRB Constable Recruitment on Hold: కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియకు సంబంధించి టీఎస్‌ఎల్‌పిఆర్‌బి(TSLPRB) కీలక ప్రకటన చేసింది. పోలిస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తదుపరి ప్రక్రియను అంటే కానిస్టేబుళ్లకు మెడికల్ టెస్టులను (Constable Medical Tests) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బోర్డ్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టీఎస్ఎల్‌పిఆర్‌బి (TSLPRB). ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు, కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవలే సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు (Constable Recruitment) హైకోర్ట్ బ్రేక్ వేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న మెడికల్ టెస్టులను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి మెయిన్ ఎగ్జామ్స్‌లో ప్రశ్నలు తప్పుగా రావడంతో 4 మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించింది. అయితే, టీఎస్ఎల్‌పిఆర్‌బి ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందంటూ ఇటీవల కొందరు అభ్యర్థులు హైకోర్టులో (High Court) పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. మెడికల్ టెస్టులు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ రాతపరీక్షలో ఇచ్చి ప్రశ్నపత్రంలో 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. దాంతో నియామక ప్రక్రియకు బ్రేక్ వేస్తూ టీఎస్‌ఎల్‌పిఆర్‌బి కీలక ప్రకటన చేసింది.
కాగా, పోలీస్ నియామక బోర్డు ఉత్తర్వులతో అభ్యర్థులతో ఆందోళన నెలకొంది. మళ్లీ ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. మొత్తానికి హైకోర్టు తీర్పుతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read:
దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు..
విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..