Jobs : నిరుద్యోగులకు అలర్ట్..ఆ శాఖలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జెన్‎కో. తెలంగాణ జెన్ కోలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రికల్ మెకానికల్, ఇంజనీరింగ్, సివిల్ విభాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి?..చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

New Update
Career: ఈ కోర్సు చేస్తే భవిష్యత్ బంగారుమయం..పూర్తి వివరాలివే..!!

TS GENCO AE Notification 2023: టీఎస్ జెన్‎కో తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యూలర్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఏఈ పోస్టుల సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 అసిస్టెంట్ ఇంజనీర్ (Assistant Engineer) పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రికల్ మెకానికల్, ఇంజనీరింగ్, సివిల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జెన్ కో నోటిఫికేషన్ లో పేర్కొంది. పై పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 29, 2023 తేదీగా అప్లయ్ చేసుకోవచ్చని తెలంగాణ జెన్ కో (TS GENCO) ఓ ప్రకటనలో తెలిపింది. బీఈ, బీటెక్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. కాగా తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతోపాటు ఇప్పటికే ఉన్న విద్యుత్ కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ఇది కూడా చదవండి: భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోష్..ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!!

మొత్తం ఖాళీలు: 339
లిమిటెడ్ రిక్రూట్ మెంట్ ఖాళీలు 94 ఉండగా...జనరల్ రిక్రూట్ మెంట్ ఖాళీలు 245 ఉన్నాయి.

అర్హతలు:
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్,
మెకానికల్ ఇంజినీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,
ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,
ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్,
ఎలక్ట్రానిక్స్ అండ్‌ కంట్రోల్ ఇంజినీరింగ్,
ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ పవర్,
పవర్ ఎలక్ట్రానిక్స్,

ఇది కూడా చదవండి: రూ.63వేల శాలరీతో ఎస్బీఐ జాబ్స్‌.. అప్లికేషన్‌కి గడువు పొడిగింపు..!

సివిల్ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2023 జులై 1వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్‌ 29, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 7, 2023వ తేదీ నుంచి మొదలవుతుంది. దరఖాస్తు సమయంలో రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 వరకు జీతం ఉంటుంది.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేసి చూడండి

Official Website

Advertisment
తాజా కథనాలు