TS TRT 2023 Exam: టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే!

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT) వాయిదా తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే దీనికి కారణమని చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5వేలపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ విధానంలో 6రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడంపై పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

New Update

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చేనెల 30 ఎన్నికలు ఉండటంతో 15రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ముమ్మరం చేయనున్నారు. అప్పటికే ఎన్నికల జోష్ తారా స్థాయి కి చేరుకుంటుంది. ఈ సమయంలో నే నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్లు, 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 24న భాషా పండితులు, 25 నుంచి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు సంబంధించి టీఆర్టీ పరీక్ష జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ పార్టీ మీద..విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…ఏమన్నారో తెలుసా?

ఈ నేపథ్యంలో పోలింగ్ జరిగే 30వ తేదీ పరీక్షను వాయిదా వేస్తే బాగుంటుందని అధికారులు అంటున్నారు. 20 వ తేదీ నుంచి ఎన్నికల సందడి మొదలవుతుంది. అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. అటు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల భద్రత కూడా ముఖ్యమే. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారట. ఈ విషయమై విద్యాశాఖకు విజ్నప్తి చేసినట్లు సమాచారం.

ఇదే కాదు ఎన్నికల విధుల్లో టీచర్లు, ఇతర సిబ్బంది బిజీగా ఉంటారు. ఇవన్నీ జరుగుతుండగా టీఆర్టీ నిర్వహించడం కష్టంగా ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి పరీక్షను వాయిదా వేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రెండు రోజుల్లో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందని ఓ అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: రెండో రోజు సీఐడీ విచారణకు నారా లోకేష్…ఏం జరగబోతోంది..??

Advertisment
తాజా కథనాలు