TS TRT 2023 Exam: టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే!
తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT) వాయిదా తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలే దీనికి కారణమని చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5వేలపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు టీఆర్టీ ఎగ్జామ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ విధానంలో 6రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడంపై పరీక్ష నిర్వహణపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.