TS SSC Exams: ఆ ఎగ్జామ్ రెండు రోజులు రాయాలా?.. పదో తరగతి పరీక్షలో మార్పు!

ప్రస్తుతం పదో తరగతి సైన్స్ పరీక్షలో రెండు పేపర్లనూ స్వల్ప వ్యవధిలో ఒకే రోజు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా ఆ రెండు పేపర్ల పరీక్షలనూ రెండు వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.

New Update
TS SSC Exams: ఆ ఎగ్జామ్ రెండు రోజులు రాయాలా?.. పదో తరగతి పరీక్షలో మార్పు!

TS SSC Exams: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఓ కీలకమైన మార్పు తెచ్చేందుకు విద్యాశాఖ త్వరలో నిర్ణయం వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్టు పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ క్రమంలోనే సైన్స్ సబ్జెక్టులో రెండు పేపర్లున్నప్పటికీ 15 నిమిషాల సమయంతో చిన్న విరామం ఇచ్చి ఒకే రోజు నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి సైన్స్ పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహించాలన్న ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు.

ఇది కూాడా చదవండి: తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్

సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉంటాయి. ప్రస్తుతం 15 నిమిషాల విరామం మాత్రమే ఇచ్చి రెండు పేపర్ల పరీక్షనూ ఒకే రోజు నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. దీంతో ఆ రెండు పేపర్ల పరీక్షలనూ వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని గతంలో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. అయితే, అప్పుడు ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. పరీక్ష కోసం ఒక రోజు అదనంగా కేటాయిస్తే, ఆ రోజుకు సిబ్బందికి భత్యాలు చెల్లించాల్సి వస్తుందని అప్పట్లో విద్యాశాఖ భావించిందని జోరుగా ప్రచారం సాగింది. మొత్తానికి యథావిధిగా ఒకేరోజు ఆ రెండు పేపర్ల పరీక్షలూ నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి: పార్టీ కోసం వెయ్యి కోట్లు అడిగాడు.. జేడీపై కేఏపాల్ సంచలన ఆరోపణలు

తాజాగా మరోసారి పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి రెండు రోజుల పాటు ఆ రెండు పేపర్ల పరీక్షల నిర్వహణ అంశంపై ప్రతిపాదన సమర్పించారు. ఈ ప్రతిపాదనకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు