TS Government: తెలంగాణలో మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే.. ఎప్పుడంటే? తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేను మరో సారి నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 5 గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్న సమయంలోనే సర్వేను నిర్వహించి వివరాలు సేకరించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. By Nikhil 25 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల సమయంలోనే సమగ్ర కుటుంబ తరహా సర్వేను నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి అస్వస్థత అంటూ వార్తలు.. ఖండించిన సీఎంవో ఈ సర్వే ద్వారా ఒక్కో కుటుంబం వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రతీ కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు తదితర వివరాలతో పాటు రేషన్ కార్డు వివరాలను అధికారులు సేకరించనున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014 ఆగస్టు 19న ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. అయితే.. ఆ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పంట బీమా పథకాన్ని రైతు యూనిట్‌గా అమలు చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని, వీలైతే వచ్చే వానకాలం నుంచే అమలు చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే పంటల బీమా అమలులోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుందని, పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. #cm-revanth-reddy #congress-government #congress-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి