TS Constable Jobs: కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వారికి షాక్.. మళ్లీ ముల్యాంకనం చేయాలన్న హైకోర్ట్..!! తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలను తొలగించాలని..అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలను వెల్లడించాలంటూ రాష్ట్ర హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆ తర్వాతే మూల్యాంకనం చేసిన రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. By Bhoomi 10 Oct 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి TS High Court Order To Constable Appointments: తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ (TSLPRB) కు హైకోర్టు బ్రేక్ వేసింది. తుది పరీక్ష నుంచి నాలుగు ప్రశ్నలను తొలగించాలని..అభ్యర్థులందరికీ 4 మార్కులు కలిపి ఫలితాలను వెల్లడించాలంటూ రాష్ట్ర హైకోర్టు పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఆ తర్వాతే మూల్యాంకనం చేసిన రిజల్ట్స్ రిలీజ్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలంటూ హైకోర్టు (TS High COurt) పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డును సూచించింది. తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ మెయిన్స్ పరీక్ష క్వచ్చన్ పేపర్ లో 122,130, 144ప్రశ్నలను తెలుగులోకి మార్చలేదని అలాగే 57 ప్రశ్నను తప్పుగా ఇచ్చారంటూ వాటిని ప్రశ్న పత్రంలో నుంచి తొలగించాలని హైకోర్టు రిక్రూట్ మెంట్ బోర్డును ఆదేశించింది. దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలను తెలుపుతూ 2022, ఆగస్టు 30వ తేదీన హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది కూడా చదవండి: బరువు తగ్గాలంటే..ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పని చేయండి..!! కాగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎస్ పీఆర్ బీ (TSLPRB) అక్టోబర్ 4వ తేదీని రిలీజ్ చేసింది. పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750మంది ఉద్యోగాలకు సెలక్ట్ అయినట్లు టీఎస్ఎస్ పీఆర్ బీ తెలిపింది. కోర్టు కేసు ద్రుష్ట్యా పలు పోస్టులకు ఫలితాలను విడుదల చేయలేదు. పీటీవోని వంద డ్రైవర్ పోస్టులు, విపత్తు నిర్వహణ ఫైర్ సేఫ్టీ శాఖలోని 225 పోస్టుల ఫలితాలు కోర్టు కేసుల కారణంగా రిలీజ్ చేయలేదని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అలెర్ట్.. ఆ సంస్థలో 232 పోస్టులకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..!! హైకోర్టు నిర్ణయంతో ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులు షాక్ అవుతున్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఉద్యోగాల భర్తీ కూడా పూర్తవ్వడం లేదని కేసులు, కోర్టుుల, తీర్పులు అంటూ తిరగాల్సి వస్తుందని నిరుద్యోగులు అసహనానికి లోనవుతున్నారు. ఇప్పటికే టీఎస పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 (TSPSC Group 1) ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దయిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 (TSPSC Group 2) నిరవధిక వాయిదా. గ్రూప్ 4 పరీక్ష నిర్వహించి నెలలు గడుస్తున్నా ఫలితాలే వెలువడలేదు. దీంతో అభ్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పట్లో ఉద్యోగాల భర్తీ లేనట్లేనని నిరుద్యోగులు ఆవేదనకు లోనవుతున్నారు. #telangana-high-court #constable-recruitment #telangana-constable-recruitment #tslprb #ts-constable-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి