తెలంగాణాలో అధ్వాన్న రోడ్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

New Update
తెలంగాణాలో  అధ్వాన్న రోడ్లపై  నివేదిక  ఇవ్వాలని  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

తెలంగాణలో గుంతల రోడ్ల పరిస్థితిపై మూడు వారాల్లో రిపోర్టివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ బాచుపల్లిలో గుంతల రోడ్డు కారణంగా ఓ చిన్నారి యాక్సిడెంట్ కు గురై మృతి చెందిన ఘటనను సుమోటాగా తీసుకున్న హైకోర్టు చీఫ్ జస్టీస్ అలోక్ ఆరాధే , జస్టీస్ టీ .వినోద్ కుమార్  డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది . దీనిపై తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై మూడు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది . దీంతో పాటు నిజాంపేట మున్సిపాలిటీని ప్రతివాదుల లిస్టులో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.

గుంతల రోడ్లతో పెరుగుతున్న ప్రమాదాలు

తెలంగాణ వ్యాప్తంగా గుంతల రోడ్లతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈనెల 2న హైదరాబాద్ బాచుపల్లిలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది . బాచుపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల దీక్షితను తన తండ్రి కిషోర్ స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్ వద్ద స్కూటీని ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడడంతో చిన్నారి పైనుంచి స్కూల్ బస్సు వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు.

దీంతోపాటు నిన్న ఖమ్మం జిల్లాలో ఒక్కరోజే మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లిలో ప్రమాదవశాత్తు బైక్ పడి ఓ వ్యక్తి మృతి చెందారు . ఖమ్మం నగరంలో శ్రీ శ్రీ సర్కిల్లో స్కూటీని లారీ ఢీకొనడంతో ఓ యువతీ మృతి చెందింది. మరొక యువతి గాయపడింది . భద్రాద్రి కొత్తగుడెం జిల్లా పాల్వంచ మండలంలో ఆటో - బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు .

Advertisment
తాజా కథనాలు