మరోసారి హైకోర్టులో వనమా కు చుక్కెదురు!

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కు మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వనమా ఎన్నిక చెల్లదంటూ కోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్తి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే కొద్ది రోజుల క్రితం వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది

మరోసారి హైకోర్టులో వనమా కు చుక్కెదురు!
New Update

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కు మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వనమా ఎన్నిక చెల్లదంటూ కోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్తి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే కొద్ది రోజుల క్రితం వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది.

ts hc on vanama interim over mla election telangana high court

అయితే తాజాగా ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఈ నెల 26న వనమా వెంకటేశ్వరరావు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో ఈ తీర్పు గురించి సవాల్‌ చేసే వరకు స్టే ఇవ్వాలని వనమా ఆ పిటిషన్‌ లో వివరించారు. కాగా ఆ పిటిషన్‌ పై హైకోర్టు బుధవారం వాదనలు వింది. తీర్పును రిజర్వ్‌ కూడా చేసింది. గురువారం ఉదయం హైకోర్టు తీర్పును తెలియజేసింది. వనమా పిటిషన్‌ ను కొట్టేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

వనమా వెంకటేశ్వరరావు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థిగా జలగం వెంకట్రావు పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల అఫిడవిట్‌ వనమా కేవలం భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు తెలియజేశారు కానీ ఆయన పేరు మీద ఉన్న స్థిరాస్తుల గురించి ఎన్నికల కమిషన్‌ కు తెలియజేయలేదని జలగం వెంకట్రావు ముందు నుంచి ఆరోపిస్తున్నారు.

2019 జనవరి నుంచి కూడా జలగం ఈ విషయం గురించి కోర్టు చుట్టు తిరుగుతున్నారు. తప్పుడు సమాచారం అందించిన వనమా మీద అనర్హత వేటు వేయాలని జలగం ముందు నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. వాటిని అన్నిటిని పరిశీలించిన హైకోర్టు ఈ నెల 25న సంచలన తీర్పును వెల్లడించింది.

2018 వనమా ఎన్నిక చెల్లదంటూ, ఆయన పై అనర్హత వేటు వేసింది. 2018 నుంచి కూడా జలగం నే ఎమ్మెల్యేగా గుర్తించాల్సిదేనని తెలిపింది. ఆ కోర్టు తీర్పు కాపీని జలగం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి కార్యాలయంలో అందించారు. వారితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కు కూడా తీర్పు కాపీని అందించారు.

తెలంగాణ 2018 ఎన్నికల సమయంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి వనమా కాంగ్రెస్‌ అభ్యర్థిగా, జలగం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వనమా జలగం మీద సుమారు 4 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వనమా కాంగ్రెస్‌ ను వీడి బీఆర్ఎస్‌ కి వచ్చారు. వనమా ఎప్పుడైతే బీఆర్‌ఎస్‌ లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా జలగం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కోర్టు జలగంని ఎమ్మెల్యేగా పరిగణించాలని తీర్పునిచ్చింది. పార్టీకి దూరం గా ఉంటున్నప్పటికీ కూడా తాను కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తున్నట్లు జలగం మీడియా ముందు వివరించారు.

#brs #highcourt #kottagudem #vanama-venkateswara-rao #jalagam-venkatrao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe